Astro Tips For God Photos: ఇంటి పూజగదిలో మనం రకరకాల చిత్ర పటాలను ఏర్పాటు చేసుకుంటాం. అయితే, చాలామంది జ్యోతిష్య నిపుణులు ఇచ్చే సూచన ఏంటంటే ప్రతి ఇంటి పూజగదిలో శ్రీరామ పట్టాభిషేకం చిత్ర పటం పెట్టుకోవాలి. ఇది ఎందుకో తెలుసుకుందాం.
ఇంటి పూజగదిలో శ్రీరామ పట్టాభిషేకం చిత్ర పటం పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ముఖ్యంగా ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి ఉపశమనం కలుగుతుంది. శ్రీరాముని పట్టాభిషేకం చిత్ర పటంలో ముఖ్యంగా శ్రీరాముడు, సీత, లక్ష్మడుణులతోపాటు ఆంజనేయుడు ఇతరులు కూడా ఉంటారు. ఇంట్లో ఈ చిత్ర పటం పెట్టుకుంటే రామరాజ్యం వలె ఇంటి సభ్యులు కలిసి ఉంటారు.
ఇంట్లో రామపట్టాభిషేకం చిత్రపటం ఉండటం వల్ల ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే గొడవలు సద్దుమణుగుతాయి. ఇంట్లో ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య సంబంధం మరింత మధురంగా మారుతుంది. భాగస్వామితో మీకు ప్రేమ ఆకర్షణలు మరింత పెరుగుతాయి.
ఇదీ చదవండి: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే లక్ మారుతుందా..?.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?
అంతేకాదు నిత్యం శ్రీరాముని పూజించే రామభక్తులకు మరణం తర్వాత నరకం నుంచి విముక్తి పొందుతారు. రామున్ని ఆదర్శంగా తీసుకోవాలని రామాయణం రాశారు. భర్త ఏవిధంగా ఉండాలి? తండ్రి మాట ఎలా ఆచరించాడు అని ఈ ఫోటో చూడగానే తెలిసిపోతుంది. ఇంట్లో పట్టాభిషేకం ఫోటోలో వినాయకుడు, శివుడు ఆంజనేయుడు సప్తరుషులు ఉంటారు. ఇలాంటి ఫోటో పెట్టడం వల్ల పిల్లాపాపలతో సంతోషంగా ఉంటారు. అంతేకాదు ఈ సీతారాములు ఫోటోకు ఎర్ర రంగు పూలతో పూజించాలి.
ఇదీ చదవండి: సాయిబాబా భక్తులకు శుభవార్త.. IRCTC హైదరాబాద్ - షిరిడీ, శింగనాపూర్ టూర్ ప్యాకేజీ..
ఈ రామావతారం ఫోటో ప్రతి హిందూ ఇంట్లో ఉండాలని పెద్దలు చెబుతారు. ప్రతి ఒక్కరు రాముని ఫోటో పెట్టుకోవాలి. అంతేకాదు అన్నదమ్ముల ఐక్యతకు ప్రతీక కూడా శ్రీ రాముడే ఆదర్శం. స్నేహానికి మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి వాలిని వధించాడు. ఇంటి ప్రధాన ద్వారానికి లోపలి వైపు గుమ్మంపై మన పూర్వీకులు ఇలా శ్రీ రామునిపట్టాభిషేకం ఫోటో ఏర్పాటు చేసుకునేవారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి